బర్డ్స్ పార్కులో మొక్కలు నాటి కేటీఆర్

హైదరాబాద్ లో మూడోవిడత హరితహారం ఘనంగా ప్రారంభమైంది. వాడవాడలా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్  మాదాపూర్ లో హరితహారంలో పాల్గొన్నారు. బర్డ్స్ పార్కులో పలు రకాల మొక్కలు నాటారు. హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.