బయటపడ్డ క్యాట్ ఫిష్ ల అక్రమ రవాణ బండారం

ఆదిలాబాద్ జిల్లాలో లారీ బోల్తా పడడంతో క్యాట్ ఫిష్ల అక్రమ రవాణా బయటపడింది.  మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఉన్న చేపల లోడ్‌ లారీ మావల దగ్గర బోల్తా పడింది. దీంతో చేపలన్నీ కంటైనర్‌ నుంచి రోడ్డు పక్కన కుప్పలుగా పడ్డాయి. అవి నిషేధంలో ఉన్న క్యాట్‌ ఫిష్‌ కావడంతో స్థానిక పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. క్యాట్‌ ఫిష్‌లు ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతున్నాయని దర్యాప్తు చేస్తున్నారు.