బట్టల వ్యాపారంలో నష్టంతో దొంగతనాల బాట

రైళ్లలో తెలివిగా దొంగతనాలు చేస్తున్న ఓ బట్టల వ్యాపారిని వరంగల్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన హరీశ్ కుమార్ జైన్‌.. జనరల్ టికెట్ తో రైలులో ఎక్కుతాడు. ఎలాగోలా ఏసీ కోచ్ లలో బెర్త్ సంపాదిస్తాడు. సంపన్నులను గుర్తించి, వారి బ్యాగులతో మాయమౌతాడు. దీంతో పోలీసులకు వివరాలు దొరక్క.. ఈ దొంతనాలు సవాల్ గా మారాయి. ఒక టీసీ ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు హరీశ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. 53 తులాల బంగారం, కేజిన్నర వెండిని స్వాధీనం చేసుకున్నారు. బట్టల వ్యాపారంలో నష్టాలు రావడంతో హరీశ్ కుమార్ ఏడాదిగా దొంగతనాలు చేస్తున్నాడని రైల్వే ఇంచార్జ్ ఎస్పీ రాజేంద్రప్రసాద్ చెప్పారు.