బంజారాహిల్స్ లో దారుణహత్య

హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. రోడ్ నెంబర్ 7లో పాత నేరస్తుల మధ్య ఘర్షణ తలెత్తి.. హత్యకు దారి తీసింది. స్వామి అనే వ్యక్తిపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్వామి అక్కడికక్కడే చనిపోయాడు. నిందితులు పరారీలో ఉన్నారు. ఇద్దరు లేదా ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు.. ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నారు.