ప్రారంభమైన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ లో ఎంపీలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కువినియోగించుకునేందుకు చేరుకున్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్, విపక్షాల తరుపున మీరా కుమార్ తలపడుతున్నారు.  రాష్ట్రపతి ఎన్నిక కోసం దేశ వ్యాప్తంగా 32 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 543 మంది లోక్ సభ, 233 మంది రాజ్యసభ సభ్యులు, 4,120 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలో ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల పరిశీలకులుగా 33 మందిని నియమించింది ఎలక్షన్ కమిషన్.  ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం వేర్వేరు బ్యాలెట్ పత్రాలు అందజేస్తున్నారు. ఎంపీలు పచ్చరంగు, ఎమ్మెల్యేలు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లలో ఓటు వేయనున్నారు. ఇందుకోసం పెన్నులను కూడా ఎన్నికల అధికారులే ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.  ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది.

9.