ప్రపంచ నేతలతో ప్రధాని మోడీ భేటీ

జీ-20 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ వెళ్లిన ప్రధాని మోడీ…ప్రపంచ నేతలతో సమావేశం అవుతున్నారు. మొదటి రోజు జీ-20 సదస్సులో పాల్గొన్న ఆయన అదే వేదికగా సౌత్‌ కొరియా అధినేతతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన ఇటలీ అధినేతతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. భారత్‌, ఇటలీ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై డిస్కస్ చేశారు.