ప్రధాని మోడీపై రాహుల్ విమర్శలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. స్వల్పకాలిక రాజకీయ లాభం కోసం… కశ్మీరులో ఉగ్రవాదులకు అవకాశాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మోడీ వైఖరి వల్లే ఉగ్రదాడులు జరుగుతున్నాయని అన్నారు. ప్రధాని విధానాలతో దేశానికి నష్టం జరుగుతోందని, అమాయక పౌరులు చనిపోతున్నారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.