ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరు కనీసం ఒక మొక్కను నాటాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి కోరారు. నాటిన మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతిఒక్కరిదన్నారు. వరంగల్ గ్రెయిన్ మార్కెట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన హరితహారంలో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. ఆ తర్వాత ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆమ్రపాలి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శృతి ఓఝా, పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.