ప్రతిపక్ష ఎంపీలను అడ్డుకున్న పోలీసులు

బెంగాల్‌లోని బసీర్‌హట్‌, బధూరియాల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో పర్యటించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు బీజేపీ, లెఫ్ట్‌, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, వీరిని పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ ఎంపీలు మీనాక్షి లేఖి, ఓం మాథుర్‌, సత్యపాల్‌ సింగ్‌ లను బసీర్‌హట్‌ ప్రాంతానికి వెళ్లనివ్వలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే అరెస్ట్ చేసి కొల్‌కతా ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. బసీర్‌ హట్‌, బధూరియాల్లో జరుగుతున్న ఘర్షణలను అదుపు చేయటంలో మమత సర్కార్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు.