ప్రతిపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్

ప్రతిపక్షాల తరఫున ఉప రాష్ట్రపతి పదవికి గోపాలకృష్ణ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో జరిగిన నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపాధ్యక్షుడు రాహుల్, టీఎంసీ, జేడీయూ, ఎస్పీ, బీఎస్పీ, వామపక్షాలు సహా 18 పార్టీల నేతలు హాజరయ్యారు. ఎన్డీయే అభ్యర్ధిగా ఇప్పటికే వెంకయ్యనాయుడు నామినేషన్ దాఖలు చేయడంతో… వీరిద్దరి మధ్యనే పోటీ ఉండనుంది. ఆగస్ట్ 5న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. 11 న నూతన ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరుగుతుంది.