ప్రజలకు మా ప్రభుత్వం భరోసా

ప్రజలకు ఏ సమస్యలు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు మంత్రి జగదీశ్‌ రెడ్డి. గత పాలకుల హయాంలో రాష్ట్రం ఎంతో వెనుకబడిందన్నారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తర్వాత ఆస్పత్రిలో 10 రూపాయల భోజన పథకాన్ని మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉత్పల్ తదితరులు పాల్గొన్నారు.