పోలీస్, ఎక్సైజ్ అధికారులతో సీఎం రివ్యూ

పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో సీఎం  కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరబాద్ ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ భేటీకి డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టర్  అకున్ సబర్వాల్  హాజరయ్యారు. డ్రగ్స్ కేసు వివరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. ఈ కేసు దర్యాప్తులో పోలీసుల సహకారం తీసుకోవాలని ఎక్సైజ్ శాఖకు సీఎం సూచించినట్లు సమాచారం.