పోచారం వైకుంఠధామంలో హరితహారం

పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో మంత్రి హరితహారంలో పాల్గొన్నారు. గ్రామంలోని వైకుంఠ ధామంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు.