పెళ్లి ఆలోచనలో పడిందట!

మిల్క్ బ్యూటీ తమన్నా పెళ్లిచేసుకోవాలనే ఆలోచనలో పడిందట. తాజాగా ఈమె ముంబైలో జరిగిన తన సోదరుడి వివాహవేడుకలో పాల్గొని వేడుకలో అన్నీతానై అలరించింది. తన సోదరుడి వివాహం గురించి తమన్నా మాట్లాడుతూ “సోదరుడి వివాహం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పింది. తనకు వరుసకు వదిన అయిన క్రితిక ఎంతో అందమైన అమ్మాయని, అన్నా వదిన ఇద్దరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇద్దరి కలలు నెరవేరాలని కోరుకుంది” తమన్నా. అయితే అక్కడున్న ఓ మీడియా ప్రతినిధి మరి మీ పెళ్లి సంగతేంటి అని అడగగా “నేను కుటుంబ సంప్రదాయాలకు అత్యంత విలువనిస్తాను. త్వరలో వరుడి కోసం వేట ప్రారంభిస్తాం.. కానీ ప్రస్తుతం మాత్రం నాకెరీర్ పైనే పూర్తిశ్రద్ద వహిస్తా. కాలంకలిసొస్తే అన్నీపూర్తవుతాయి”అని చెప్పింది.తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించిన తమన్నా ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన ‘స్కెచ్’ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మరో రెండుసినిమాలు చేయడానికి సిద్దపడుతోంది.