పాలమూరు హరిత వనంలో మంత్రి హరీశ్

మహబూబ్ నగర్‌ లో హరిత వనం పేరుతో ఏర్పాటు చేసిన అర్బన్ లంగ్‌ స్పేస్ ను మంత్రి హరీశ్ రావు సందర్శించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా 250 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. హరిత వనంలోని వ్యూ పాయింట్, అడ్వెంచర్ జోన్ ను మంత్రి పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ ద్వారా ఆ ప్రాంతంలో చెక్ డ్యామ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌, కలెక్టర్‌ రొనాల్డ్ రాస్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.