పాలమూరు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కొత్త భవనం ప్రారంభం

మహబూబ్ నగర్ జిల్లా కొత్తగా నిర్మించిన పోలీస్ హెడ్‌ క్వార్టర్స్‌ ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్‌, అంజయ్య యాదవ్‌, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆఫీస్ ప్రాంగణంలో హోంమంత్రి మొక్క నాటారు.