పాలమూరులో రైతు బజార్ కు శంకుస్థాపన

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించనున్న రైతు బజార్‌కు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. రైతు బజార్‌ నిర్మాణానికి 2 కోట్ల 75 లక్షలను విడుదల చేశామన్నారు. ఇటు నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, గద్వాల్‌ పట్టణాల్లోనూ రైతు బజార్లను నిర్మిస్తామన్నారు మంత్రి హరీష్‌ రావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆ తర్వాత మహబూబ్‌ నగర్‌ లో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మూడో బ్రాంచ్ ఆఫీస్‌  ప్రారంభోత్సవంలో మంత్రులు హరీశ్‌ రావు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మిగతా రాష్ట్రాల్లో రెండు బ్రాంచ్ లు మాత్రమే ఉన్నాయని… తెలంగాణలో మాత్రమే మూడోది ఏర్పాటయిందని వారు చెప్పారు. ఎంపీ జితేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌ గౌడ్‌, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.