పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలోని మయూరి నర్సరీలో అర్బన్ లంగ్ స్పేస్ పార్క్, అడ్వెంచర్ పార్క్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అడ్వెంచర్ పార్క్‌లో ఏర్పాటు చేసిన రోప్‌వేను మంత్రి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రోప్ వేపై మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ రొనాల్డ్ రాస్‌ ప్రయాణించి ఎంజాయ్ చేశారు. అనంతరం మయూరీ నర్సరీలో మొక్కలు నాటారు. ఆ తర్వాత న్యూటౌన్ నుంచి రైల్వేష్టేషన్ వరకు సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు.