పాలమాకుల మోడల్ స్కూల్లో హరితహారం

రంగారెడ్డి జిల్లా పాలమాకుల గ్రామంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడల్‌ స్కూల్లో జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌ రెడ్డి, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు.