సమస్యలపై పార్లమెంటులో గళమెత్తుతాం

ఈ వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలపై గళమెత్తుతామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎంపీలందరం ఇవాళ పార్లమెంటులో ఓటు హక్కు వినియోగించుకున్నామని వినోద్‌ తెలిపారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ముఖ్యంగా హైకోర్టు విభజన, రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు చేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు ఎంపీ వినోద్‌.