పార్లమెంట్‌ లైబ్రరీ భవన్‌లో ఆల్ పార్టీ మీటింగ్

పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్లమెంట్‌ లోని లైబ్రరీ భవన్‌ లో అన్ని పార్టీల నేతలతో పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటికీ ప్రధాని మోడీ సహా పలువురు కేంద్రమంత్రులు అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు హాజరయ్యారు. టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీ జితేందర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్ మాత్రం ఈ భేటీకి హాజరుకాలేదు. రేపటి నుంచి సాగే సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం విపక్షాలను కోరనుంది. అటు పలు కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.