పాతబస్తీలో కార్డన్ సెర్చ్

హైదరాబాద్‌ పాతబస్తీలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సౌత్‌ జోన్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఇంద్రనగర్‌, హుందాకాలనీలో తనిఖీలు చేశారు. 36 మంది అనుమానితులు, ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్న 13 మందిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. సరైన పేపర్స్‌ లేని 42 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ప్రజలే తమ కాలనీల్లో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారని డీసీపీ సత్యనారాయణ వెల్లడించారు.