పాక్ మహిళకు సుష్మా సాయం!

పాకిస్థాన్‌లో క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒక మహిళకు మెడికల్ వీసా అందించేందుకు కేంద్ర మంత్రి సుష్మా‌స్వరాజ్ హామీ ఇచ్చారు. పాకిస్థాన్‌కు చెందిన ఫైజా తన్వీర్ ఓరల్ ట్యూమర్ ఎమీలోబ్లాస్టోమా అనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చికిత్స కోసం ఆమె భారత్ రావాలకుంది. అయితే ఆమెకు వీసా మంజూరులో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆమె తన సమస్యను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా‌స్వరాజ్‌కు విన్నవించారు. దీంతో సుష్మా.. ఆమెకు మెడికల్ వీసా మంజూరుకు హామీ ఇచ్చారు. తన్వీర్ ఢిల్లీలోని ఇంద్ర్ర ప్రస్థ్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోనున్నారు. ఇందుకు రూ. 10 లక్షల వరకూ ఖర్చు కానున్నట్లు సమాచారం.