ఉమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ జయభేరీ

ఉమెన్స్ వరల్డ్‌ కప్‌లో ఇండియా దుమ్మురేపింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీంఇండియా.. తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. 95 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది.  మొదట బ్యాటింగ్‌ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అయితే 170 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను ఇండియా బౌలర్లు ఊడ్చిపారేశారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్‌ను శాసించారు. ఇండియా బౌలర్ల ధాటికి పాకిస్థాన్‌ 38.1 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. పది ఓవర్లలో 18 పరుగులిచ్చి 5వికెట్లు తీసిన ఏక్తాబిస్త్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికైంది.