పాక్ ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి

సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్.. మరోసారి బరి తెగించింది. జమ్మూకాశ్మీర్‌ లోని కుప్వారాలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికులపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే అలర్టయిన బలగాలు.. పాక్‌ రేంజర్ల కాల్పులను తిప్పికొడుతున్నాయి.