పట్టపగలే దోపిడికి యత్నం

రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి విఫలయత్నం చేశారు. స్టాఫ్‌ ను కత్తి, తుపాకితో బెదిరింపులకు గురిచేశారు. ఇంతలో అప్రమత్తమైన అసిస్టెంట్‌ మేనేజర్‌ లతీఫ్‌ ఎమర్జెన్సీ అలారం నొక్కాడు. స్థానికులు ముత్తూట్‌ ఆఫీస్‌ కు చేరుకునేలోగా దొంగలు అక్కడి నుంచి పరారీ అయ్యారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఫిర్యాదుతో  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.