నోట్ల రద్దు, జీఎస్టీ పెద్ద స్కాములు

పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ దేశంలోనే అతిపెద్ద స్కాములని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. తాము ఎవ్వరికీ తలవంచమని, అవసరమైతే సంతోషంగా జైలుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ తర్వాత కోల్ కత్తాలో ఆమె మీడియాతో మాట్లాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా తాను ఓటు వేశానని మమత చెప్పారు. బీజేపీకి ఎవరూ మద్దతు ఇవ్వొద్దని, ప్రజల పక్షాన నిలవాలని కోరారు.

దేశ సరిహద్దుల్లో జరిగే అలజడుల వల్ల తాము అత్యంత ఎక్కువ నష్టపోతున్నామని మమత ఆవేదన వ్యక్తం చేశారు. భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ లతో సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. సరిహద్దుల్లో ఇంత జరుగుతున్నా ఐబి, ఎస్ఎస్బీ, రా వంటి జాతీయ భద్రత సంస్థలు ఏం చేస్తున్నాయని మమత ప్రశ్నించారు.