నోట్ల మార్పిడికి మరో అవకాశం ఎందుకు ఇవ్వలేదు..?

పెద్ద నోట్ల రద్దు సమయంలో పాత నోట్లు మార్చుకోలేకపోయిన వారికి మరో అవకాశం ఎందుకు ఇవ్వకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. పెద్ద నోట్లు రద్దుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ  సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు మార్చుకోలేకపోయిన వారి కోసం ప్రత్యేక కౌంటర్లేమైనా ఏర్పాటు చేశారా? అని ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. సరైన కారణం చూపిస్తే….నోట్ల మార్పిడికి అవకాశం ఇవ్వాలని, లేకపోతే…నిజాయితీ పరులు నష్టపోతారని అభిప్రాయడింది అత్యున్నత న్యాయస్థానం. అంతేకాదు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం కొంత సమయం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు.