నెయ్యి లేకుండా ముద్దదిగదు!

బాలీవుడ్‌ బబ్లీగర్ల్‌గా పిలవబడే అలియాభట్‌కు అభిమాన సంఘాలు కాస్త ఎక్కువే. క్యూట్‌ పెర్‌ఫార్మెన్స్‌కు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌ అనీ, యాక్టింగ్‌కి రోల్‌ మోడల్‌ అని అభిమానులు కొనియాడుతుంటారు. తాజాగా ఆమె తినే ఫుడ్ గురించి చెప్పింది. ‘‘డైటింగ్‌ కోసం నాకంటూ ఓ రూల్‌ బుక్‌ ఉంది. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు తినడం నాకు నచ్చదు. చాలామంది కార్భోహైడ్రేట్స్‌ తగ్గించడానికి గ్లూటన్‌ ఫ్రీ పిజ్జా, బ్రౌన్‌ బ్రెడ్‌, రెడ్‌రైస్‌ తీసుకుంటే మంచిదంటారు. నేనైతే అలా చెయ్యను. ఉదయాన్నే నాలుగు గంటలకు వైట్‌ బ్రెడ్‌, బటర్‌ తింటాను. అది ఆరోగ్యానికి, బాడీ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందని నా పర్సనల్‌ డైటీషియన్‌ చెప్పారు. అదే ఫాలో అవుతా. డాల్‌ కిచిడీ, పెరుగన్నం నాకు బాగా నచ్చిన ఆహారపదార్థాలు. ఎంత డైట్‌ చేసినా నెయ్యి లేకుండా మాత్రం తినను’’ అని చెప్పింది.