నిజామాబాద్ హరితహారంలో ఎంపీ కవిత

నిజామాబాద్ జిల్లాలో హరితహారం కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఆవరణలో ఎంపీ కవిత, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ మొక్కలు నాటారు. తెలంగాణకు హరితహారంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడం ఆనందంగా ఉందని ఎంపీ కవిత తెలిపారు. నాటిన మొక్కలన్నింటిని సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని దేశపతి శ్రీనివాస్ అన్నారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ ఆకుల సుజాత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.