నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. వీటి ప్రభావంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.