నాటిన ప్రతి మొక్కను బతికించాలి

నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో హరితహారం, స్వచ్ఛ భారత్‌, ఉపాధి హామీ పనులపై జూపల్లి సమీక్ష నిర్వహించారు. భారీగా వర్షాలు కురుస్తున్నందువల్ల పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలను కోరారు. హరితహారంలో ఈసారి అవార్డులు ఇవ్వనున్నట్లు జూపల్లి తెలిపారు. హరితహారం విజయవంతంలో ఉపాధి కూలీల పాత్ర కీలకమైందన్నారు మంత్రి జూపల్లి. హరితహారంలో కొల్లాపూర్ ని ఆదర్శంగా మారుద్దామని చెప్పారు.