దేశ భద్రత విషయంలో రాజీలేదు

దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు అఖిలపక్షం నేతలు. దేశ భద్రత విషయంలో కేంద్రానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌ నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టిఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకాశ్మీర్ లో శాంతి భద్రతలతో పాటు భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై విపక్ష పార్టీలకు వివరించారు రాజ్‌  నాథ్‌. అమరనాథ్ యాత్రికులపై ఉగ్రదాడికి సంబంధించిన వివరాలు కూడా తెలిపారు. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనాతో ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్చలే పరిష్కారమని చెప్పారు.

ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జైట్లీ, సుష్మాస్వరాజ్‌ తో పాటు ఎన్‌ ఐఎ చీఫ్ అజిత్‌  దోవల్‌, విదేశాంగ కార్యదర్శి కూడా హాజరయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి ఎంపీలు కేకే, జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.