తొలి ఓటు వేసిన సీఎం కేసీఆర్

అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యేల సెల్‌ఫోన్‌లు, పెన్నులను అధికారులు పోలింగ్ బూత్‌లోకి అనుమతించడం లేదు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో వీరికి మాక్ పోలింగ్ నిర్వహించారు. తెలంగాణ భవన్ నుంచి శాసనసభ్యులు, మంత్రులు మూడు బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు.