తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో విశేషాలు

తెలంగాణ సాహిత్య అకాడమీ లోగోను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌ లోని ప్రగతిభవన్‌ లో లోగోను విడుదల చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ లోగో మధ్యలో ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంస ముక్కు స్థానంలో పాళీ కనిపిస్తుంది. హంస కింద పుస్తకం పుటలను నీటి అలల మాదిరిగా చిత్రించారు. లోగో పైభాగంలో తెలంగాణ మ్యాపులో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. లోగో మధ్యలో పాల్కురికి సోమన రాసిన “సరసమై బరగిన జాను తెనుగు” అనే పద్యపాదాన్ని చేర్చారు. సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, శిల్పి ఎం.వి.రమణారెడ్డి రూపొందించారు.