తిరుమలయ్య గుట్టలో హరితహారం

వనపర్తిలోని తిరుమలయ్య గుట్ట అటవీ ప్రాంతంలో నిర్వహించిన హరితహారంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి పాల్గొన్నారు. టీయూడబ్ల్యుజే సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి, ఎస్పీ రోహిణి, మూడు వేల మంది విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.

అడవులు లేకనే వాతావరణంలో పెనుమార్పులు వస్తున్నాయని, పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని నిరంజన్ రెడ్డి కోరారు. నాటిన ప్రతి మొక్క ఎదిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.