తడిసిముద్దయిన హైదరాబాద్

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. అత్యధికంగా మాదాపూర్‌ లో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండగా మారనున్నదని, దీని ప్రభావంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు బేగంపేట వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. అటు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ ….వరద సహాయక సిబ్బందిని  అప్రమత్తం చేసింది. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసింది.

భారీ వర్షంతో గ్రేటర్ హైదరాబాద్ తడిసి ముద్దయింది. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇండ్లల్లోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. హుస్సేన్‌సాగర్‌ పొంగిపొర్లినా ఎటువంటి ఇబ్బందీ లేదని బల్దియా స్పష్టం చేసింది. వచ్చే రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికారులు వరద సహాయక సిబ్బందిని అప్రమత్తం చేశారు. 24 గంటలు కంట్రోల్ రూం కొనసాగేలా ఆదేశాలు జారీచేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండగా మారనున్నదని, దీని ప్రభావంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు బేగంపేట వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు అత్యధికంగా నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్ శ్రీనగర్‌కాలనీలో 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, అత్యల్పంగా షాపూర్‌నగర్‌లో 7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు వివరించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు హుస్సేన్‌సాగర్‌లోకి భారీగా నీరు చేరుతున్నది. సాగర్‌లోకి వచ్చే వరదనీరు యథావిధిగా బయటకు వెళ్లేందుకు రెండువైపులా తూములు ఉండగా, అదనంగా ఏర్పాటు చేసిన గేట్‌ను తెరిచి నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. మరోవైపు వరదలతో ఎటువంటి అవాంచనీయ పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి సహాయక సిబ్బందిని అప్రమత్తం చేశారు. సర్కిళ్లవారీగా సిబ్బంది సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. కాల్ సెంటర్ నంబర్- 040-21 11 11 11తోపాటు అత్యవసర సమయాల్లో ఫోన్ చేసేందుకు 100 టోల్ ఫ్రీ నంబర్‌ను 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నట్టు వివరించారు.అటు భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు ముంపునకు గురికాగా, ఇండ్లల్లోకి భారీగా నీరు చేరింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.