ఢిల్లీలో సోలార్ రైలు పరుగులు

తొలిసారిగా సౌరశక్తితో నడిచే లోకల్ రైలును రైల్వేశాఖ ప్రారంభించింది. సౌరశక్తిని విద్యుత్‌శక్తిగా నిల్వచేసుకునే బ్యాటరీ బ్యాంక్‌తో ఈ డెమూ (డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) ట్రెయిన్ రాత్రీ పగలూ నడువనుంది. కోచ్‌లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ఆధారంగా లైట్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డులు పనిచేయనున్నాయి. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు జెండా ఊపి రైలును ప్రారంభించారు. సోలార్ ఆధారిత కోచ్‌లను ఏర్పాటు చేయడంతో 1500 హార్స్‌పవర్ సామర్థ్యంతో ఈ రైలు పరుగులు తీయనుంది. ఈ రైలు ద్వారా ఏటా రూ.12లక్షల విలువైన 21వేల లీటర్ల డీజిల్ ఆదా కానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇలాంటి మరిన్ని రైళ్లను తీసుకురావాలని రైల్వేశాఖ భావిస్తున్నది.