ఢిల్లీలో గద్వాల విద్యార్ధి కిడ్నాప్

ఢిల్లీలో తెలంగాణ విద్యార్థి కిడ్నాప్ కు గురయ్యాడు. గద్వాలకు చెందిన శ్రీకాంత్ గౌడ్ ను దుండగుడు అపహరించాడు. ఇతను 2011లో చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో హాస్పిటల్ లో పీజీ చదువుతున్న శ్రీకాంత్.. గౌతం నగర్ లో రెంటుకు ఉంటున్నాడు. గురువారం రాత్రి కారులో వెళ్తుండగా ఓలా క్యాబ్ డ్రైవర్ అపహరించాడు. అనంతరం దుండగుడు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. శ్రీకాంత్ ను రక్షించాలని అతని కుటుంబసభ్యులు కేంద్రప్రభుత్వానికి  విజ్ఞప్తి చేశారు.