డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరొకరిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, ఈ కేసులో అరెస్టుల సంఖ్య 14కు చేరింది. ఇవాళ ఏజీ కాలనీలో అదుపులోకి తీసుకున్న నిందితుడిని విచారణ కోసం ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చారు.

మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే రిమాండులో ఉన్న కీలక నిందితులు కెల్విన్, ఖుద్దూస్, వాహిద్ లను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని రెండు రోజులు విచారించేందుకు కోర్టు అనుమతించింది.

డ్రగ్స్ కేసులో ఇప్పటికే నోటీస్ అందుకున్న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇవాళ ట్విట్టర్ లో స్పందించాడు. ఈ విషయంలో తానిప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదని, ఎవరిపై వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నాడు. పైసా వసూల్ సినిమా షూటింగ్ లో తాను బిజీగా ఉన్నానని చెప్పాడు.