డ్రగ్స్‌ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతాం

ఆన్‌ లైన్‌ డ్రగ్స్‌ అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు సైబరాబాద్‌ పోలీస్ కమిషనర్ సందీప్‌ శాండిల్య. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సైబర్‌ దాడులను అరికట్టేందుకు సైబర్‌ సెక్యూరిటీని పటిష్ట పరుస్తామన్నారు. అందుకోసం వచ్చే అక్టోబర్‌ 23న సైబరాబాద్  సెక్యూరిటీ కాంక్లేవ్-2017 ను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వస్తారని సందీప్‌ శాండిల్య వెల్లడించారు.