డెగానా ప్రాంతంలో కర్ఫ్యూ ఎత్తివేత

ఫేస్ బుక్ పోస్ట్  కారణంగా అల్లర్లు చెలరేగిన… బెంగాల్ లోని నార్త్ పరగణా జిల్లాలో సాధారణ పరిస్థితుల నెలకొంటున్నాయి.  అల్లర్లతో అట్టుడికిన డెగానా ప్రాంతంలో కర్ఫ్యూ ఎత్తి వేశారు. దీంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నారు. వ్యాపారలు ప్రారంభమయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సున్నితమైన అంశాలకు సంబంధించిన వార్తలను వెంటనే నమ్మకూడదని బెంగాల్  పోలీసులు సూచిస్తున్నారు.