డిప్యూటీ సీఎం కడియం పుట్టినరోజు వేడుకలు

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీ కెప్టెన్‌ లక్ష్మికాంతారావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్‌ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.