డిజిటల్ టెక్నాలజీని తలదన్నే చేనేత ప్రతిభ

టెక్నాలజీని అందిపుచ్చుకుని తమ కళకు జీవం పోస్తున్నారు చేనేత కళాకారులు. సిరిసిల్లకు చెందిన విజయ్ తన నేత పనికి సాంకేతికతను జోడించి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. డిజిటల్ ప్రింటింగ్‌ ను తలపించే చేనేత వస్త్రాన్ని తయారు చేసి అందరి మన్ననలు పొందుతున్నాడు. కేటీఆర్ దంపతుల ఫోటోను చీరపై నేసి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఈ చీరను మంత్రి కేటీఆర్‌ కు బహుకరించనున్నట్లు విజయ్ తెలిపారు.