ట్రాఫిక్‌ ఈ చలాన్స్‌ విత్‌ ఎం వ్యాలెట్‌ యాప్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌ను ట్రాఫిక్‌ పోలీసులు, రవాణ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ ఈ చలాన్స్‌ విత్‌ ఎం వ్యాలెట్‌ యాప్‌ను రవాణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సునీల్‌ శర్మతో కలిసి సీపీ మహేందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్‌ ని ఆగస్టు 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు సీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1 నుంచి పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి వస్తున్నందున వాహనదారులు జాగ్రత్తగా బండ్లు నడపాలని ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినదాన్నిబట్టి పెనాల్టీ పాయింట్లు ఇస్తామని, నిర్ణీత పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.