ట్రంప్ సీట్లో ఇవాంకా, సర్వత్రా విమర్శలు

జీ-20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీటులో ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ కూర్చోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ దిగ్గజ నేతలు కూర్చునే టేబుల్ దగ్గర నుంచి ట్రంప్ లేచి పక్కకు వెళ్లగానే ఆయన కూతురు ఇవాంకా వచ్చి అందులో కూర్చున్నారు. దీంతో అమెరికా అధినేత బంధుప్రీతి ఆరోపణలు మరోసారి దుమారం రేపాయి. తన కుటుంబ సభ్యులను ఆయన వైట్‌హౌస్ పదవుల్లో నియమించడం కూడా వివాదాస్పదమైంది.  ఎన్నిక కాని, అర్హత లేని, శిక్షణ లేని న్యూయార్క్ సోషలైట్ అమ్మాయి అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఉత్తమ ప్రతినిధిగా భావిస్తున్నారా? అని అమెరికా చరిత్రకారిణి ఆన్నె యాపిల్‌ బాం ట్విట్టర్‌లో ట్రంప్‌ పై విమర్శలు చేశారు.