ట్రంప్ నోటి దురుసు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరోసారి తన నోటి దురుసు ప్రదర్శించారు. ఫ్రెంచ్  ఫస్ట్ లేడీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ టూర్‌ కు వచ్చిన ట్రంప్ దంపతులకు  ఫ్రెంచ్‌ అధ్యక్షుడు మాక్రాన్‌, ఆయన భార్య బ్రిగిట్టీ వెల్కం చెప్పారు. భోజనానికి వెళ్లేముందు మాక్రాన్‌  భార్యతో మాట్లాడిన ట్రంప్‌.. యు ఆర్ ఇన్ స‌చ్ ఎ గుడ్ షేప్‌.. బ్యూటిఫుల్ అని కామెంట్ చేశారు. ఆ సమయంలో ట్రంప్ భార్య కూడా పక్కనే ఉన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను హుందాగా స్వీక‌రించిన బ్రిగిట్టీ.. న‌వ్వి ఊరుకున్నారు. ఈ సన్నివేశాన్ని ఫ్రెంచ్ ప్రభుత్వం సోషల్ మీడియా అధికారిక ఎకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.