ట్రంప్‌ నిర్ణయంపై స్టీఫెన్ హాకింగ్ ఆగ్రహం

పారిస్ వాతావరణ ఒప్పందంనుంచి అమెరికా తప్పుకోవాలన్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ నిర్ణయంపై ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మండిపడ్డారు. అమెరికా నిర్ణయం భూసమస్థితిని తీవ్రంగా ప్రభావితం చేయనుందని, భూమిని ఉష్ణగ్రహంగా మార్చేందుకు దారితీసే ప్రమాదముందని హాకింగ్ అందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ నిర్ణయం ఫలితంగా వెనక్కిరాలేని మార్పులకు భూవాతావరణం లోనవుతుందని, భూమి శుక్రుడిలాగా ఉష్ణగ్రహంగా మారుతుందని, ఉష్ణోగ్రత 250 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందన్నారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ వర్షాలు కురుస్తాయని హాకింగ్‌  హెచ్చరించారు.