హుస్సేన్ సాగర్ కు పెరుగుతున్న వరద

హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హుస్సేన్ సాగర్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో, హుస్సేన్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. వివిధ నాలాల నుంచి వరదనీరు భారీగా వస్తుండటంతో గేట్ కొంతమేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు వరద పరిస్థితిపై సమీక్షిస్తోంది.