టెట్‌కు 3.67 లక్షల దరఖాస్తులు

రాష్ట్రంలో జూలై 23న నిర్వహించనున్న టీచర్ అర్హత పరీక్ష (టెట్) కోసం 3 లక్షల 67 వేల 635 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులకు నిన్నటితో గడువు ముగిసింది. పేపర్ 1 కోసం 1,11,597 మంది, పేపర్ 2 కోసం 2,56,038 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు టెట్ కన్వీనర్  శేషుకుమారి తెలిపారు.